Lenin Movie Collections: అయ్యాగారే నెంబర్ 1..బాక్సాఫీస్ వద్ద 'లెనిన్' ఊచకోత
Lenin Movie: అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది.
Lenin Movie Collections: అయ్యాగారే నెంబర్ 1..బాక్సాఫీస్ వద్ద 'లెనిన్' ఊచకోత
Akhil Akkineni: థియేటర్లలో 'లెనిన్' మాస్ ర్యాంపేజ్ మామూలుగా లేదు. కేవలం టాక్‌తోనే కాకుండా కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఈ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
మొదటి రోజు దేశవ్యాప్తంగా మొత్తం 2,028 షోల ద్వారా 'లెనిన్' భారీ వసూళ్లను రాబట్టింది. ఇండియా నెట్ కలెక్షన్స్ రూ. 5.90 కోట్లను సాధించింది. ఇండియా గ్రాస్ కలెక్షన్స్ రూ.6.73 కోట్లను రాబట్టింది. కేవలం ఒక్క రోజే ఇండియాలోనే ఈ స్థాయి వసూళ్లు సాధించడంతో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్, చూపించిన ఇంటెన్సిటీ మాస్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేయడమే దీనికి ప్రధాన కారణం.
తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో మొదటి రోజే ఈ చిత్రం ఏకంగా రూ. 3.00 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అఖిల్ క్రేజ్ ఏంటో నిరూపించింది. ఇండియా, ఓవర్సీస్ కలెక్షన్లు అన్నీ కలుపుకొని 'లెనిన్' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా.. మొత్తం వరల్డ్‌వైడ్ రూ. 9.73 కోట్ల గ్రాస్‌ను రాబట్ట కలిగింది. ఒక్క రోజే దాదాపు రూ. 10 కోట్ల మార్కును టచ్ చేసి బాక్సాఫీస్ వద్ద అఖిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
మొదటి రోజే ఇంతటి భారీ వసూళ్లు సాధించిన 'లెనిన్'.. వీకెండ్ అయ్యేసరికి మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాలో యాక్షన్‌తో పాటు ఎమోషన్ కూడా బలంగా వర్కవుట్ అవ్వడం, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తుండటంతో లాంగ్ రన్‌లో ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అక్కినేని ఫ్యాన్స్ మూడేళ్లుగా దాచుకున్న కసిని థియేటర్లలో కలెక్షన్ల రూపంలో చూపిస్తున్నారని చెప్పవచ్చు.




