Aishwarya Rajesh: గోదావరి, తెలంగాణ యాసలపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్!

Aishwarya Rajesh: టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా దూసుకుపోతున్న ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్.

Srinivas Rao
Published on: 21 July 2026 12:35 PM IST
Aishwarya Rajesh
X

Aishwarya Rajesh: గోదావరి, తెలంగాణ యాసలపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్! 

Aishwarya Rajesh: టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా దూసుకుపోతున్న ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్. 'సంక్రాంతికి వస్తున్నాం' విజయం తర్వాత వరుసగా తెలుగు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె, తాజాగా 'ఓ! సుకుమారి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మణిరత్నం, వెట్రిమారన్, అనిల్ రావిపూడి వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన అనుభవం ఉన్న ఐశ్వర్య, కొత్త దర్శకులతో పనిచేయడంపై తన మనసులోని మాటలను పంచుకున్నారు.

కొత్త దర్శకులపై ఐశ్వర్య రాజేష్ స్పందన

"మనమందరం ఏదో ఒక సమయంలో కొత్తవారమే కదా! దర్శకులు కథను చెప్పే విధానం, వారు నాలో నింపే ఆత్మవిశ్వాసమే నాకు ముఖ్యం. ఆ నమ్మకమే నేను ఒక ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పేలా చేస్తుంది" అని ఐశ్వర్య పేర్కొన్నారు. అలాగే తాను ఏ సినిమా ఒప్పుకునే ముందైనా చెన్నైలోని తన ఇంట్లో ఉన్న చిన్న ఆఫీస్‌లో స్నేహితులు, దర్శకులు, రచయితలతో కూడిన తన ప్రత్యేక బృందంతో గంటల తరబడి స్క్రిప్ట్ గురించి చర్చిస్తానని తెలిపారు. తమిళ పరిశ్రమపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, తెలుగులో మాత్రం కొన్ని సందేహాలు వస్తాయని, అందుకే ప్రతి ప్రాజెక్ట్‌ను తన టీమ్‌తో చర్చించాకనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

కమర్షియల్ సక్సెస్, విజయాలు-అపజయాలపై దృక్పథం

'సంక్రాంతికి వస్తున్నాం' వంటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ తర్వాత కూడా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్న ఐశ్వర్య, సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను ఎలా స్వీకరిస్తారనే దానిపై స్పందిస్తూ.. "తమిళంలో వరుసగా ఐదు హిట్లు ఇచ్చినప్పుడు మా ఇల్లు బొకేలతో నిండిపోయింది. ఆ తర్వాత ఏడాది కేవలం రెండు హిట్లు మాత్రమే వచ్చాయి, దాంతో ఇంటికి వచ్చే బొకేల సంఖ్య తగ్గింది. కానీ, బొకేల సంఖ్యతో సంబంధం లేకుండా నాలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే నేను నేర్చుకున్నాను" అని తెలిపారు.

వివిధ యాసలపై పట్టు

'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడిన ఐశ్వర్య, తాజా చిత్రం 'ఓ! సుకుమారి'లో తెలంగాణ యాసను ఉపయోగించారు. వివిధ యాసల్లో మాట్లాడటం కష్టమనిపించిందా అని ప్రశ్నించగా.. "అస్సలు కష్టంగా అనిపించలేదు. నేనొక తెలుగు అమ్మాయి కావడంతో ఏ తెలుగు యాస కూడా నాకు కష్టమనిపించదు. వివిధ ప్రాంతీయ యాసల్లో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని ఐశ్వర్య రాజేష్ సంతోషం వ్యక్తం చేశారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story