Pranitha Subhash: భర్త పాదాలకు పూజ చేసిన తెలుగు హీరోయిన్!
Pranitha Subhash: నటి ప్రణీత సుభాష్ తన భర్త నితిన్ రాజు పాదాలకు పూజ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Pranitha Subhash: భర్త పాదాలకు పూజ చేసిన తెలుగు హీరోయిన్!
Pranitha Subhash: ‘బావ’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అత్తారింటికి దారేది’లో ‘బాపు గారి బొమ్మ’గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల నటి ప్రణీత సుభాష్. హీరోయిన్‌గానే కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, 2021లో బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటోంది.
తాజాగా ప్రణీత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఓ చిత్రం నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన ఆమె, తన భర్త నితిన్ రాజు పాదాలను పూజించి, నమస్కరిస్తున్న ఫోటోను పంచుకుంటూ భీమన అమావాస్య అని క్యాప్షన్ ఇచ్చారు.కర్ణాటకతో పాటు దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో ఆషాఢ మాసం చివరి రోజైన అమావాస్య నాడు ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భర్త ఆయురారోగ్యాలు, సౌభాగ్యం, సంతోషం కోసం స్త్రీలు చేసే ప్రత్యేక పూజ ఇది.
ఆధునిక జీవనశైలిలో ఉన్నప్పటికీ భారతీయ సనాతన సంప్రదాయాలను, పండుగలను గౌరవిస్తూ ప్రణీత ప్రతి ఏటా ఈ పూజను క్రమం తప్పకుండా ఆచరిస్తుంటారు. గతంలోనూ ఆమె భర్త పాదపూజ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా మన సంస్కృతీ సంప్రదాయాలను నిలబెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ నెటిజన్లు, అభిమానులు ప్రణీతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.




