Chandini Chowdary: ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది నువ్వే కదా?
Chandini Chowdary: నటి చాందిని చౌదరి కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టారు.
Chandini Chowdary: ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది నువ్వే కదా?
Casting Couch: తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి చాందిని చౌదరి ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, క్యాస్టింగ్ కౌచ్‌ను ధైర్యంగా బయటపెట్టి తీవ్ర దుమారం రేపారు. అవకాశాల పేరుతో కమిట్‌మెంట్ అడిగిన ఒక వ్యక్తిని, అతడు చేసిన నెగిటివ్ ప్రచారాన్ని ఎండగడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించి, 2015లో 'కేటుగాడు' సినిమాతో కథానాయికగా మారిన చాందిని... అదే ఏడాది మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' చిత్రంలో చిన్న పాత్ర చేస్తున్న సమయంలో జరిగిన దారుణాన్ని చెప్పుకొచ్చింది.
ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఆఫర్ ఇప్పిస్తానని ఒక వ్యక్తి మొదట చాందిని తల్లి సమక్షంలో మాట్లాడాడు. ఆ తర్వాత ఫోన్ చేసి చాందినిపై బాడీ షేమింగ్ చేస్తూ.. ఆ బ్రాండ్ దక్కాలంటే కొందరికి కమిట్‌మెంట్ ఇవ్వాలని పరోక్షంగా తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఆ ప్రతిపాదనను చాందిని నిరాకరించడంతో, ఆ వ్యక్తి ఆమె తల్లికి ఫోన్ చేసి అత్యంత అసభ్యంగా మాట్లాడాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చాందిని కుటుంబం హెచ్చరించింది. దీంతో కక్ష పెంచుకున్న సదరు వ్యక్తి చాందినికి పొగరు ఎక్కువని, ఆమెతో పనిచేయడం కష్టమని ఇండస్ట్రీలో నెగిటివ్ ముద్ర వేశాడని, ఆ చెడు ప్రచారం తన కెరీర్‌ను వెంటాడిందని ఆమె వాపోయారు.
ఏడేళ్ల తర్వాత, అంటే 2024లో హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో తన సినిమా ప్రమోషన్ల సమయంలో ఆ వ్యక్తి మళ్లీ ఎదురవగా చాందిని ఏమాత్రం వెనుకాడలేదు. ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా? అని అతని ముఖం మీదే నేరుగా నిలదీసి తన ధైర్యాన్ని చాటుకున్నారు. 'మను', 'కలర్ ఫోటో', 'గామి', 'ఏవమ్', 'మ్యూజిక్ షాప్ మూర్తి', 'డాకు మహారాజ్' వంటి వైవిధ్యమైన చిత్రాలతో నటిగా పరిశ్రమలో దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్‌కు తలొగ్గకుండా ఎదురొడ్డి నిలిచిన చాందిని చౌదరి ధైర్యాన్ని నెటిజన్లు, సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.




