Actess Hema: కర్మ నిన్ను వదిలిపెట్టదు.. ఇంతకు ఇంత అనుభవిస్తావు.. అనసూయకు నటి హేమ కౌంటర్!

Actess Hema: 'జై శ్రీరామ్' వివాదంలో అనసూయ భరద్వాజ్‌పై నటి హేమ తీవ్రంగా మండిపడ్డారు.

Gagan kumar
Published on: 22 Aug 2026 11:53 AM IST
Actess Hema
X

Actess Hema: కర్మ నిన్ను వదిలిపెట్టదు.. ఇంతకు ఇంత అనుభవిస్తావు.. అనసూయకు నటి హేమ కౌంటర్!

Actess Hema: టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల చేసిన ‘జై శ్రీరామ్’ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర కామెంట్లు చేసే వారిని ఉద్దేశించి మాట్లాడే క్రమంలో ఆమె 'జై శ్రీరామ్' అనే పదాన్ని ఉపయోగించడంపై నెటిజన్లు, హిందూ బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూ ధర్మాన్ని కించపరిచారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో, అనసూయ ఇన్ స్టా వేదికగా స్పందిస్తూ.. తన మాటలను కావాలని వక్రీకరించారని, తాను ఎవరి మనోభావాలనూ దెబ్బతీయలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఈ వివాదంపై తాజాగా సీనియర్ నటి హేమ స్పందిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అనసూయ తీరును తీవ్రంగా తప్పుబడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

హేమ తన వీడియో సందేశంలో అనసూయకు నేరుగా క్లాస్ పీకారు. అద్దాల మేడలో బతుకుతున్నాం. హాయ్ అనసూయ.. మనమందరం అద్దాల మేడలో బతుకుతున్నాం. మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పనిని సోషల్ మీడియా భూతద్దంలో పెట్టి చూస్తుంది. ఈ విషయం నీకు తెలియనిది కాదు, అలాంటప్పుడు ఎందుకు స్లిప్ అవుతుంటావు? అని ప్రశ్నించారు. నీ వ్యక్తిగతం, నీ ధర్మం నీ ఇష్టం. కానీ కోట్ల మంది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే మాటలకు, చేసే పనులకు తేడా ఉంటే జనాలు వెంటనే పసిగడతారు అని స్పష్టం చేశారు.

జై శ్రీరామ్' అనేది కేవలం ఒక స్లోగన్ కాదు.. అది కోట్లాది మంది హృదయాల్లో నిలిచే మంత్రం, ఒక పవర్. నిన్ను ఎవరైనా అంటే వాళ్లను సూటిగా ప్రశ్నించు. అంతేకానీ దేవుడి ఫోటోలు పెట్టుకుని, ఆ పదాన్ని ముసుగుగా వాడుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండవ వీడియోలో ఇచ్చిన్ వివరణపై స్పందిస్తూ..మొదటి వీడియో ఒకటి పెట్టి, రెండో వీడియోలో 'నేను అందరినీ అనలేదు, ఎవరో కొందరి గురించే అన్నాను.

అని కలరింగ్ ఇచ్చావు. నీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఆ వ్యక్తులు ఎవరో ఓపెన్‌గా క్లారిటీగా మాట్లాడు. అంతేగానీ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే మాత్రం తీవ్ర పరిణామాలు అనుభవించాల్సి వస్తుంది అని హెచ్చరించారు.

మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ, చెడు మాట్లాడితే ఆ కర్మ పదింతలై తిరిగి మనకే వస్తుంది. నీ విషయంలోనూ అదే జరుగుతుంది, జాగ్రత్త. భగవంతుడు, తెలుగు ఇండస్ట్రీ, తెలుగు అభిమానులు నీకు చాలా ఇచ్చారు, నిన్ను అందలం ఎక్కించారు.

అలాంటి అభిమానుల నమ్మకాల గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో అంటూ హేమ గట్టి హెచ్చరికతో తన వీడియోను ముగించారు. ప్రస్తుతం హేమ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ వివాదం మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story