Dhurandhar 2 Review: దురంధర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా చూసి ఆర్జీవీ చెప్పింది ఇదే!
Dhurandhar 2 Review: రణవీర్ సింగ్ ధురంధర్ 2 పై ఆర్జీవీ క్రేజీ రివ్యూ. షోలే కంటే వంద రెట్లు గొప్పదని ట్వీట్. హాలీవుడ్ దర్శకులకు ఆర్జీవీ కౌంటర్
Dhurandhar 2 Review
Dhurandhar 2 Review: ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా దురంధర్ మూవీ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ రేపు అంటే మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా పై అంతులేని అంచనాలు ఉన్నాయి. దురంధర్ 2 మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే బాలీవుడ్ అనే కాకుండా అన్నిభాషల్లోనూ రిలీజ్ కావలసిన పెద్ద మూవీస్ తమ డేట్స్ మార్చేసుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రీమియర్స్ గురువారం రాత్రికి ప్రత్యేకంగా థియేటర్లలో పడబోతున్నాయి. అయితే, ఈలోగా ప్రముఖుల కోసం ప్రత్యేక ప్రీమియర్ షో వేశారు దురంధర్ మేకర్స్.
ఈ స్పెషల్ షో చూసిన ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ అద్భుతమైన రివ్యూ సోషల్ మీడియాలో ఇచ్చేశారు. సినిమా మామూలుగా లేదు. హాలీవుడ్ దర్శకులంతా ఇప్పుడు ఈ మూవీ చూసి సినిమా ఎలా తీయాలో నేర్చుకోండి అని ఆర్జీవీ అన్నారంటే ఏ స్థాయిలో ఈ మూవీ ఉండి ఉంటుందో అంచనా వేయవచ్చు.
“నిన్న రాత్రి దురంధర్ 2 సినిమా చూసిన తరువాత ఇది వసూళ్లు, ప్రేక్షకుల ఉత్సాహం, సినిమాపై వచ్చే రివ్యూలు, సోషల్ మీడియా ప్రభావాలు ఇలాంటి అన్నిరకాల అంచనాలను మించిపోతుంది. అలాంటి రెగ్యులర్ పంథాలన్నింటినీ బద్దలు కొట్టేస్తుంది. అసలు ఈ మూవీ షోలే కంటే, నూరు రెట్లు అద్భుతంగా ఉంది” అంటూ తన X పోస్ట్ లో ఆర్జీవీ పేర్కొన్నారు. ఆయన షోలే మూవీకి పెద్ద ఫ్యాన్ అనే విషయం తెలిసిందే.
అంతేకాకుండా, మొఘల్-ఎ-ఆజమ్ నుండి మొదలు పతీతి ఇప్పటివరకూ వచ్చిన అన్ని గొప్ప మూవీస్ ని టీవీ సీరియల్స్ అని అనిపించేలా దురంధర్ 2 చేసేస్తుంది. ఇది కొక కొత్త సినిమాటిక్ వ్యవస్థ పుట్టుకకు నాంది పలుకుతుంది. ఇప్పటివరకూ సినిమా ప్రపంచంలో కనిపించిన ప్రతి అద్భుతాన్ని దురంధర్ 2 నిర్దాక్షిణ్యంగా నాశనం చేసేస్తుంది. అంటూ సినిమాని ఒక రేంజిలో పైకి లేపేశారు.
అసలు ఆర్జీవీ లాంటి వ్యక్తి నుంచి సినిమా రివ్యూల గురించి ఎక్స్పెక్ట్ చేయడమే ఎక్కువ. ఒకవేళ ఆయన రివ్యూ ఇచ్చినా నిర్మొహమాటంగా తప్పుల్ని ఏకి పారేస్తారు. అటువంటిది దురంధర్ 2 గురించి ఈ రేంజిలో ఎలివేషన్ ఇవ్వడం సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తుందనడంలో సందేహం లేదు.
అసలే దురంధర్ మూవీ తరువాత ఈ సీక్వెల్ పై విపరీతమైన అంచనాలతో సినిమా లవర్స్ ఉన్నారు. దానికి నిదర్శనమే అడ్వాన్స్ బుకింగ్స్. 'ధురందర్: ది రివెంజ్' మార్చి 18న సాయంత్రం 5.30 గంటల నుంచి పెయిడ్ ప్రివ్యూలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే 4 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. మరి ఇలాంటి నేపథ్యంలో ఆర్జీవీ ఇచ్చిన ఈ రివ్యూతో మూవీ ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో.. కాదు కాదు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
'ధురందర్' ఫస్ట్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు.. పెయిడ్ ప్రీమియర్ కి వచ్చిన కలెక్షన్స్ లెక్కలు చూస్తుంటే ఈ సీక్వెల్ అంతకు మించి సాధిస్తుందనిపిస్తోంది. కానీ, ఆర్జీవీ రివ్యూ చూస్తే కలెక్షన్స్ తో పాటు విమర్శకుల నుంచి కూడా రికార్డ్ స్థాయిలో ప్రశంసలు పొందేలా ఉందనిపిస్తుంది. మరి అసలు మూవీ ఎలా ఉందో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఈలోపు ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇక్కడ మీకోసం ఇస్తున్నాం.. చూసేయండి..




