Narsapur: నర్సాపూర్‌లో తీవ్ర విషాదం.. పెళ్లికి వెళ్లి అనంత లోకాలకు!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన ముగ్గురు స్నేహితులు నాచారం చెక్ డ్యాంలో పడి మృతి చెందారు.

G Ashok Reddy, Narsapur
Published on: 7 May 2026 10:52 AM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో తీవ్ర విషాదం.. పెళ్లికి వెళ్లి అనంత లోకాలకు!

నర్సాపూర్: మృత్యువులోనూ వీడని స్నేహబంధం నాచారం చెక్ డాం లో పడి నర్సాపూర్ పట్టణానికి చెందిన ముగ్గులు స్నేహితులు మృతి. నర్సాపూర్ మే నాచారం చెక్ డాం లో పడి నర్సాపూర్ పట్టణానికి చెందిన ముగ్గురు స్నేహితులు మృతి చెందిన సంఘటన పట్టణంలో తీవ్ర విషాదం నింపింది. నర్సాపూర్ పట్టణానికి చెందిన ప్రశాంత్ యాదవ్,వికాస్, ఆనంద్ రెడ్డి తూప్రాన్ లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం స్నానం చేయడానికి వెళ్లిన వారికి ఈత రాకపోవడంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందినట్లు తెలిసింది.

రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందినా కుటుంబీకులు వారి ఫోన్ లకు ఫోన్లు చేసిన తీయకపోవడంతో ఘటన స్థలానికి చేరడంతో విషయం బయటపడింది. ముగ్గురు కూడా నర్సాపూర్ పట్టణానికి చెందిన వారు. కాగా ఇందులో వికాస్ కు వివాహం జరిగింది. ప్రశాంత్ యాదవ్, ఆనందులకు వివాహం జరగలేదు. గురు స్నేహితులు మృతితో నర్సాపూర్ పట్టణంలో విషాద ఛాయలు అలుమూకొన్నాయి. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తూప్రాన్ పోలీసులు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story