Medak: మెదక్‌లో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా సమావేశం: మహేష్ గౌడ్ ఫైర్!
Medak: మెదక్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు.
Medak: మెదక్‌లో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా సమావేశం: మహేష్ గౌడ్ ఫైర్!
మెదక్ ఆగస్టు 24: గ్రామాలలో కార్యకర్తలు బలంగా ఉన్నప్పుడే పార్టీ బలపడుతుందని మరోసారి అధికారంలోకి వస్తామని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాలంటే కార్యకర్త చొరవ ఉండాలని కార్యకర్త ఒక సైనికుడిగా పని చేయాలని అప్పుడే పార్టీ బలపడి మరోసారి అధికారంలోకి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో హెచ్ కన్వెన్షన్ లో.ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించారుడీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే లు మైనంపల్లి రోహిత్, సంజీవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు మైనంపల్లి హనుమంతరావు, జగ్గారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నిర్మల జగ్గారెడ్డి, ఆకాంక్ష రెడ్డి, పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, ,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కంచుకోట గా ఉండేదని రాబోయే రోజులలో కాంగ్రెస్ కంచుకోటగా మార్చడానికి కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని తెలిపారు ముఖ్యంగా ఈ సమావేశంలో ఓటర్ నమోదు కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది కావున 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని ఒకవేళ ఓట్లు గల్లంతు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని గుర్తించి ఓటు హక్కు వచ్చేలా చూడాలని ఆయన తెలిపారు.
పేదవాడి ఓటు కాపాడుకోవాలి అనే ప్రతి కార్యకర్త భావించాలని ఆయన తెలిపారు రాజ్యాంగం కల్పించిన హక్కులలో 18 సంవత్సరాలు నుండి ఈ దేశ పౌరుడై ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని కానీ పేద ప్రజల ఓట్లు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయనితో కేంద్ర బిజెపి ప్రభుత్వం పేదవాడి ఓట్లను తీసివేసే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ కార్యకర్త బిఎల్ఓ ఈనెల 26 వరకు ఓట్ల నమోదు కార్యక్రమాన్ని చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను సొసైటీ లో నామినేట్ చేయడం జరుగుతుందని అందులో 70% మందిని కాంగ్రెస్ వారికి ఇవ్వడం జరుగుతుందని ఇది ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధిష్టానం చెప్పడం మూలంగానే అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా ఉంటేనే పార్టీ బలపడుతుందని ఆయన అన్నారు నిత్యం కాంగ్రెస్ పార్టీ పైన టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు బిజెపి నాయకులు రఘునందన్ రావులు విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు.
10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి పాలనలో ఏమి చేశారు హరీష్ రావు ప్రజలకు వివరించాలని వారు చేసిన పది సంవత్సరాల పాలన దోపిడీ పాలన భూదందా అరాచక పాలనలో ప్రజలు విసుగు చెందారని ఆయన తెలిపారు హైదరాబాద్లో ధర్నా చౌక్ ఎత్తివేసిన ఘనత కేసిఆర్కే దక్కిందని కెసిఆర్ కు ప్రజలు ప్రతిపక్షం పాత్ర ఇచ్చిన ఏనాడు అసెంబ్లీ గేటు వద్దకు రాలేదని ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. కేటీఆర్ సోషల్ మీడియాను నమ్ముకుని అధికారంలోకి వస్తామని భ్రమ పడుతున్నాడని సోషల్ మీడియాలో వచ్చే వార్తలు 20% నిజమని 70% అబద్ధమని ఆ వార్తలని నమ్ముకొని కేటీఆర్.
వాటికే పరిమితమవుతాడని ఆయన అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో విఫలమైందని విమర్శించారు. మతం, కులం పేరుతో రాజకీయాలను ప్రజలు నమ్మడం లేదని, యువత ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ 100 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు, పేదలకు చేరువలో వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.
కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, హద్దులు దాటి మాట్లాడితే పార్టీ ఉపేక్షించదని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని తెలిపారు పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని నాయకులు గ్రహించాలని తెలిపారు కార్యకర్తలకు ఎల్లప్పుడూ మంచిగా ఉంటే సంతోషంగా ఉంటే పార్టీ అభివృద్ధి చెంది అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు.
ఓట్లను కాపాడే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని కార్యకర్తలను కాపాడే బాధ్యత పార్టీకి ఉంటుందని ఆయన తెలిపారు. పార్టీలో వర్గాలను ఏర్పాటు చేసుకోవద్దని వర్గాల తోటే పార్టీ నష్టపోతుందని అధికారంలోకి రావడం కష్టమని అయినా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం ఆర్థిక సౌలంబన కోసం కార్యకర్తలకు అండదండగా ఉంటుందని ఆయన తెలిపారు అనంతరం ఉమ్మడి మెదక్ జిల్లా నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతిరాజ్. వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




