Narsapur: స్వచ్ఛ కార్మికులకు నూతన దుస్తులు, భద్రతా సామగ్రి పంపిణీ!

Narsapur: మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ కార్మికులకు నూతన దుస్తులు, ఆప్రాన్లు, ప్రజారోగ్య సామగ్రి పంపిణీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మాచునూరి లక్ష్మీ యాదవ్.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 13 Aug 2026 10:45 PM IST
Narsapur
X

Narsapur: స్వచ్ఛ కార్మికులకు నూతన దుస్తులు, భద్రతా సామగ్రి పంపిణీ!

నర్సాపూర్: మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి మాచునూరి లక్ష్మీ యాదవ్, మున్సిపల్ కమిషనర్ శ్రీ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో గురువారం పురపాలక సంఘం స్వచ్ఛ కార్మికులకు కొత్త దుస్తులు, ఆప్రాన్లు, ఇతర ప్రజారోగ్య సామగ్రిని పంపిణీ చేశారు.

స్వచ్ఛ కార్మికుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. పట్టణ పరిశుభ్రతలో స్వచ్ఛ కార్మికుల సేవలు ఎంతో కీలకమని, ప్రజారోగ్య పరిరక్షణలో వారు అందిస్తున్న సేవలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శ్రీ వనముల బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు అఫ్రీన్, మహమ్మద్ జరీనా బేగం, దుర్గప్ప సరళ, అంతారం సుధీర్ గౌడ్, చింతకుంట శ్రీకాంత్, మన్నె నిరంజన్ దాస్, మేనేజర్ వైట్ల మధుసూదన్‌తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story