Medak: ప్రయాణికుల తిప్పలు.. ప్రైవేటు దోపిడీ షురూ!
Medak: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం. 112 మంది కార్మికుల నిరసనతో 35 బస్సులు నిలిచిపోయాయి.
Medak: ప్రయాణికుల తిప్పలు.. ప్రైవేటు దోపిడీ షురూ!
Medak: మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమైంది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమవడంతో నర్సాపూర్ ఆర్టీసీ 112 మంది కార్మికులు ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగగా నర్సాపూర్ బస్ డిపోలో మొత్తం 35 బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు బస్ డిపో ముందు ధర్నా నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే అదనుకో భావించిన ప్రైవేటు వాహనాలు యజమానులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు డబల్ రేట్లు ప్రయాణికుల దగ్గర వసూలు చేస్తున్నారు. అనునిత్యం నరసాపూర్ నుండి హైదరాబాద్ కి వివిధ పనుల మీద వెళ్లే ప్రయాణికులు వేలల్లో ఉంటారు.
నర్సాపూర్ హైదరాబాద్ కి దగ్గరగా ఉండడంతో ఇక్కడి నుండి వ్యాపారా నిమిత్తం వెళ్లే వారికి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆర్టీసీ సం కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్కూలుకు వెళ్లే విద్యార్థులకు కానీ జాబు లోకి వెళ్లే మహిళలు గాని పురుషులు కానీ చాలా అవస్థలు పడుతున్నట్టు వాళ్లు తెలిపారు. కొంతమంది ప్రయాణికులకు సమ్మె కారణంగా బస్సులు రావని తెలియకపోవడంతో బస్టాండ్లలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి చేస్తున్నారు..
నర్సాపూర్ బస్ డిపో దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు తూప్రాన్ డిఎస్పి శ్రీధర్ గౌడ్ శాంతియుతంగా సమ్మె నిర్వహించాలని కోరారు.




