Medak: మెదక్ పట్టణానికి తలమానికం.. రూ. 8 కోట్లతో భారీ మాడ్రన్ వెంచర్!

Medak: మెదక్ జిల్లా కేంద్రంలో రూ. 8 కోట్ల ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ నిధులతో 24.30 ఎకరాల్లో మాడ్రన్ వెంచర్ ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక తెలిపారు.

NAGARAJ, MEDAK
Published on: 5 May 2026 1:01 PM IST
Medak
X

Medak: మెదక్ పట్టణానికి తలమానికం.. రూ. 8 కోట్లతో భారీ మాడ్రన్ వెంచర్!

మెదక్: ఎమ్మెల్యే కృషితోనే రూ. 8 కోట్లు మంజూరు అర్బన్ చాలెంజ్ ఫండ్ పట్టణంలో ఏర్పాటు కానున్న 24.30 ఎకరాల వెంచర్ నివాస, వాణిజ్య, బహుళ అంతస్థుల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నాం.మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతిరాజ్ మెదక్ జిల్లా కేంద్రానికి తలమాణికంగా మాడ్రన్ వెంచర్ ఏర్పాటు చేసుకోబుతున్నందున ఎంతో సంతోషంగా ఉందని మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధికభూపతిరాజ్ అన్నారు. సోమవారం మున్సిపల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రం సమీపంలో పిల్లికొట్టాల్ శివారులో 24.30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే వెంచరు అర్బన్ చాలెంజ్ ఫండ్ క్రింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఎంపికైన 8 మున్సిపాలిటీలలో మెదక్ మున్సిపాలిటీ ఉండటం పట్ల ఎమ్మెల్యే రోహిత్ కృషి ఎంతో ఉందన్నారు. మున్సిపల్ అభివృద్ధికి ప్రతి పాధనలు పంపాలని ఆదేశాలు రాగానే ఎమ్మెల్యే రోహిత్ మాడ్రన్ వెంచర్ ప్రతి పాధించడం జరిగిందన్నారు. అంతేగాకుండా ఎప్పటికప్పుడు సిడిఎంఏకు ఫోన్ల ద్వారా సంప్రదించి కేంద్ర ప్రభుత్వ అర్బన్ చాలెంజ్ ఫండ్ క్రింద ఎంపికయయ్యేలా కృషి చేయడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున రూ.8 కోట్లు మం జూరవడం, 302 నివాస, వాణిజ్య, బహుళ అంతస్థుల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నందున మరోసారి ఎమ్మెల్యే రోహిత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావులకు చైర్పర్సన్ కానుగు రాధికభూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story