Siddipet: మిరుదొడ్డిలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

Siddipet: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 20 Aug 2026 4:23 PM IST
Siddipet
X

Siddipet: మిరుదొడ్డిలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!

Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

82వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసిన నాయకులు.ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మండల అధ్యక్షులు నర్ర రాజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నేరెళ్ల భూమ గౌడ్ మాట్లాడుతూ.. అతి చిన్న వయసులోనే దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టి భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు.

దేశాన్ని ఆధునిక సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.ముఖ్యంగా దేశంలో ఐటీ, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ పునాదులు వేశారని గుర్తుచేశారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story