Medak: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఒక వజ్రాయుధం లాంటిది
Medak: కేంద్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SSR) పై అవగాహన కోసం నిర్వహించిన 2కె రన్‌ను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు.
Medak: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఒక వజ్రాయుధం లాంటిది
మెదక్: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఒక వజ్రాఆయుధంలాంటిదని, స్వేచ్చాయుత, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహణకు ఓటరు జాబితాను మరింత సమగ్రంగా , పారదర్శకమైనదిగా రూపొందించుటకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్-2026)లో అర్హులైన ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు.
ఎస్‌ఐఆర్-2026పై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు గాను జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన 2కె రన్‌ను మెదక్ జిల్లా కేంద్రంలోని. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం వద్ద జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి రాందాస్ చౌరస్తా వరకు వరకు ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఓటరు జాబితా ఖచ్చితత్వంపై ఆధారపడి ఉంటుందని, ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నమోదుచేసుకోవానలన్నారు, అలాగే ఇప్పటికే
నమోదు చేసుకున్న పౌరులుhttps://voters.eci.gov.in లో తమ పేర్లు ను తనిఖీ చేసుకోవచ్చునని, అవసరమైతే సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకోనుటకు సహాయం కోసం బూత్ లెవెల్ అధికారులను సంప్రదించవచ్చని అన్నారు.
పారదర్శకమైన, సమగ్రమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, మరణించిన వ్యక్తుల పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించేందుకు (సర్) కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి ఎన్‌మరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని తెలిపారు.
ఈ ప్రక్రియలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.మృతిచెందిన వ్యక్తుల పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించడం ద్వారా మరింత ఖచ్చితమైన ఓటరు జాబితా ను రూపకల్పన చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ముఖ్యలక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. ఓటర్ల నమోదు, సవరణలు, అభ్యంతరాలు, క్లెయిమ్స్‌కు సంబంధించిన వివరాలను సంబంధించి బూత్ లెవెల్ అధికారులను సంప్రదించవచ్చి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
అర్హులకు ఓటు హక్కు కల్పించడం ఎంత ముఖ్యమో అనర్హులను ఓజరు జాబితా నుండి తొలగించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సత్ప్రవర్తనతో మెలిగి ప్రజాస్వామ్యంలో ఉత్తమ పౌరులుగా ఆదర్శంగా నిలవాలన్నారు.
జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. సర్ లో ప్రజలందరి భాగస్వామ్యం అవసరం అన్నారు. సర్ కార్యక్రమం వల్ల నకిలీ ఓట్లు తొలిగిపోతాయన్నారు. యువత మత్తు పదార్థాలపై అవగాహన కల్గి ఉండాలన్నారు. యువత ఉన్నత లక్ష్యాల వైపు దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.
మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజ్ మాట్లాడుతూ.. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు సర్ దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాల నుండి యువతీ యువకులు అందరూ ఓటరుగా నమోదు చేసుకొని, మరణించిన వారిని, రెండుసార్లు ఓటరుగా నమోదైన వారిని తొలగించే ప్రక్రియని ఆమె తెలియజేశారు.
అనంతరం జిల్లాను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెల్ఫీ పాయింట్ లో కలెక్టర్ అదనపు ఎస్పీ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి, తాహసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఎలక్షన్ సూపరిండెంట్ గఫార్, ఆర్ అండ్ బి ఈ.ఈ వేణు, జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్ర రాజు, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు , విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.




