Medak: బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Medak: జాతీయ జెండా ఆవిష్కరించి, కేసీఆర్ దశాబ్ద కాల ప్రగతి పాలనను కొనియాడిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. క్యాడర్‌తో అస్తిత్వ రక్షణ ప్రతిజ్ఞ.
Medak: బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
మెదక్: తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాలు, విద్యార్థులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాల సమష్టి పోరాట ఫలితంగానే ఆవిర్భవించిందని,కేసీఆర్ దూరదృష్టి, సుపరిపాలనతో తొలి పదేళ్ల తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా
మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణంలో మాజీ ఎమ్మెల్సీ శేరి. సుభాష్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ లు,పార్టీ శ్రేణులతో కలిసి పద్మ దేవేందర్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పార్టీ అధినేత మాజీ సీఎం కెసిఆర్ గారి ఆదేశాల మేరకు నాయకులతో కలిసి ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ఆస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి పునరంకితం చేసుకుంటామని కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను చేదిద్దాం- మన తెలంగాణను రక్షించుకుందాం అనే నిదానంతో నిరంతరం ఉద్యమిస్తామని మనసా,వాచా,కర్మణా ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం మాట్లాడుతూ..14 ఏళ్ల అలుపెరగని ఉద్యమం, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు. అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, సబ్బండ వర్గాల సమష్టి పోరాట ఫలితంగానే ఆరు దశాబ్దాల కల సాకారమైందని గుర్తు చేశారు.
తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారాయని తెలిపారు. దేశంలో అతి పిన్న వయస్సున్న రాష్ట్రంగా తెలంగాణ అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించిందని, ఇందుకు కేసీఆర్ సుపరిపాలనే కారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ లు అరేళ్ళ. మల్లికార్జున్ గౌడ్,బట్టి జగపతి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ రెడ్డి,జడ్పీ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, సీనియర్ నాయకులు సుబ్రభాత్ రావు మున్సిపల్ కౌన్సిలర్ లు బట్టి ఉదయ్ కుమార్, దీపక్ కుమార్, గంగామణి,కో కన్వీనర్ లు కిష్ట గౌడ్,లింగా రెడ్డి,మెదక్ హవెలిఘనపూర్ మండల అధ్యక్షులు అంజ గౌడ్, సిచ్. శ్రీనివాస్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ లు మెదక్ పట్టణం,మెదక్ హవెలిఘనపూర్ మండల నాయకులు,మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




