Narsapur: నర్సాపూర్‌లో యువ పారిశ్రామికవేత్త గడ్డం దేవేందర్ సన్మానం
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో యువ పారిశ్రామికవేత్త గడ్డం దేవేందర్‌ను ఘనంగా సన్మానించిన నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్.
Narsapur: నర్సాపూర్‌లో యువ పారిశ్రామికవేత్త గడ్డం దేవేందర్ సన్మానం
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన యువ పారిశ్రామికవేత్త గడ్డం దేవేందర్‌కు మంగళవారం ఘన సన్మానం నిర్వహించారు. నర్సాపూర్ పట్టణంలోని ఎన్‌జీఓస్ కాలనీకి చెందిన దేవేందర్ వ్యాపార రంగంలో సాధిస్తున్న విజయాలను అభినందిస్తూ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.
ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. గడ్డం దేవేందర్ వంటి యువ పారిశ్రామికవేత్తలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు.
నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీరాజు యాదవ్ మాట్లాడుతూ, యువత తమ ప్రతిభ, కృషితో వివిధ రంగాల్లో రాణించి నర్సాపూర్‌కు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇలాంటి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అంతారం సుధీర్ గౌడ్, దావూద్ ఖాన్, సీనియర్ నాయకుడు గుర్రాల మల్లేష్, నర్సాపూర్ మండల ఉపాధ్యక్షులు ఆకుల నిఖిల్, రాజేష్, లలిత్ తదితరులు పాల్గొని గడ్డం దేవేందర్‌ను అభినందించారు.
సన్మానానికి స్పందించిన గడ్డం దేవేందర్, తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో మరింత కష్టపడి యువతకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తానని తెలిపారు.




