Narsapur: మట్టి పరీక్షలతోనే అధిక దిగుబడులు.. ఆర్‌డీఓ రామకృష్ణ
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ‘రైతు వారోత్సవాల’ సందర్భంగా నేల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Narsapur: మట్టి పరీక్షలతోనే అధిక దిగుబడులు.. ఆర్‌డీఓ రామకృష్ణ
Narsapur: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక99 రోజుల ప్రణాళిక లో భాగంగా 04-05-2026 నాడు “రైతు వారోత్సవాల లో భాగంగా వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నేల ఆరోగ్య సంరక్షణ పై ప్రతిజ్ఞ చేసారు.మట్టి నమూనా సేకరించే విధానం, మట్టి పరీక్ష యొక్క లాభాలు వివరించారు. మట్టి ఆరోగ్య కార్డులు రైతులకు అందించి ఫలితాలను బట్టి ఎరువుల సిఫారసునువ్వు తెలియజేసారు. సేంద్రీయ మరియు ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది. సమతుల ఎరువుల యాజమాన్యం గురించి క్షుణ్ణంగా వివరించారు
వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు అయినటువంటి కుసుమలు, ఆయిల్ పామ్ పంటల సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో RDO రామకృష్ణ రావు, వ్యవసాయ అధికారి దీపిక, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ, హార్టికల్చర్ ఆఫీసర్ రచన,, వ్యవసాయ విస్తరణ అధికారి మోహన్, మరియు రైతులు పాల్గొన్నారు.




