Narsapur: రోడ్డుపై ఫ్రూట్ బండ్లు పెడితే కేసులే.. నర్సాపూర్ పోలీసుల వార్నింగ్!

Narsapur: నర్సాపూర్ బస్టాండ్, హైవేపై రోడ్లను ఆక్రమించి ఫ్రూట్ బండ్లు, ఆటోలు పెడితే కఠిన చర్యలు తప్పవని నర్సాపూర్ పోలీసులు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

G Ashok Reddy, Narsapur
Published on: 10 Sept 2026 7:45 PM IST
Narsapur
X

Narsapur: రోడ్డుపై ఫ్రూట్ బండ్లు పెడితే కేసులే.. నర్సాపూర్ పోలీసుల వార్నింగ్!

నర్సాపూర్: నర్సాపూర్ పట్టణంలో ట్రాఫిక్‌కు అడ్డుగా నిలుస్తున్న ఫ్రూట్ బండ్లు, పండ్ల బాక్సులు, టేబుళ్లు, ఆటోలపై పోలీసులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం, వాహనాలను రోడ్డుపైనే నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం ఇకపై ఏమాత్రం సహించబోమని నర్సాపూర్ పోలీస్ శాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

“ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం.. ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు” అని పోలీసులు స్పష్టం చేశారు.

రోడ్డుపై ఫ్రూట్ బండ్లు పెడితే చర్యలు తప్పవు

నర్సాపూర్ బస్టాండ్, చౌరస్తా పరిసరాల్లో కొందరు ఫ్రూట్ వ్యాపారులు రోడ్డు మార్జిన్, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి బండ్లు ఏర్పాటు చేయడం, పండ్ల బాక్సులు, టేబుళ్లు రోడ్డుపై పెట్టడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని పోలీసులు తెలిపారు.

ఫ్రూట్ బండ్లు, పండ్ల బాక్సులు, ఇతర సామగ్రిని రోడ్డుపైకి తీసుకురావద్దని స్పష్టం చేశారు. నిర్ణీత లేదా అనుమతించబడిన ప్రదేశాల్లోనే వ్యాపారం నిర్వహించాలని ఆదేశించారు.

రోడ్డును ఆక్రమించి వ్యాపారం చేస్తే ఇక హెచ్చరికలు ఉండవు.. నిబంధనల ప్రకారం చర్యలు తప్పవు అని పోలీసులు తేల్చి చెప్పారు.

రోడ్డుపైనే ఆటోలు నిలిపితే ఇక చర్యలే

నర్సాపూర్ బస్టాండ్ ఎదురుగా, చౌరస్తాలో మెదక్, తూప్రాన్ వైపు వెళ్లే మార్గాల్లో ఆటోలను రోడ్డుపైనే నిలిపి ప్రయాణికులను ఎక్కించడం, దించడం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని పోలీసులు పేర్కొన్నారు.

ఇప్పటికే పలుమార్లు సూచనలు, హెచ్చరికలు చేసినా నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్లపై ఇక నుంచి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ముఖ్యంగా నేషనల్ హైవేపై ట్రాఫిక్‌కు అడ్డంగా ఆటోలు లేదా ఇతర వాహనాలను నిలిపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ట్రాఫిక్‌కు అడ్డొస్తే ఎవరినీ వదిలేది లేదు

వ్యాపారులు, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా రోడ్లపై అక్రమంగా వాహనాలు నిలిపే వారిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లను ఆక్రమించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.

ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సహకరించాలని, రోడ్ల ఆక్రమణలను ప్రోత్సహించవద్దని పోలీస్ శాఖ కోరింది.

నర్సాపూర్ రోడ్లపై ట్రాఫిక్‌కు అడ్డుగా నిలిస్తే ఇక “వార్నింగ్” కాదు.. యాక్షన్ ఉంటుందని పోలీసులు ఇచ్చిన తాజా హెచ్చరిక ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story