Narsapur: నర్సాపూర్‌లో మృగశిర కార్తె చేపల సంత.. కమిషనర్‌కు వినతిపత్రం!

Narsapur: నర్సాపూర్ పట్టణంలో మృగశిర కార్తె చేపల సంతను చిల్డ్రన్స్ పార్క్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని వ్యాపారులు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.

G Ashok Reddy, Narsapur
Published on: 2 Jun 2026 5:04 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో మృగశిర కార్తె చేపల సంత.. కమిషనర్‌కు వినతిపత్రం!

Narsapur: నర్సాపూర్ పట్టణంలో మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే సంప్రదాయ చేపల సంతను ఈ ఏడాది స్థానిక చిల్డ్రన్స్ పార్క్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కోరుతూ పట్టణంలోని చేపల వ్యాపారులు మరియు వాణిజ్య దుకాణదారులు మున్సిపల్ కమిషనర్ శ్రీ చెరుకు సాయికుమార్ కి వినతిపత్రాలు ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్ స్పందిస్తూ, ప్రజలకు మరియు వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

మృగశిర కార్తె సందర్భంగా చేపల కొనుగోలు కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సదుపాయం, భద్రతా ఏర్పాట్లు మరియు ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం చేపల సంతను సక్రమంగా నిర్వహించేందుకు మున్సిపల్ యంత్రాంగం అన్ని విధాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story