Narsapur: గూడూరు సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పూజలు
Narsapur: గూడూరు దత్తాత్రేయ గురుపీఠం, సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, సుహాసిని రెడ్డి.
Narsapur: గూడూరు సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పూజలు
నర్సాపూర్: గురుపౌర్ణమి సందర్భంగా శివంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ గురుపీఠం, శ్రీ సాయిబాబా దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీ గురుపీఠం ఫౌండర్-చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, ట్రస్ట్ సభ్యురాలు రమాదేవి ఆధ్వర్యంలో వేదపండితులు వామన శర్మ, ఆలయ పూజారులు హర్ష శర్మ, నటరాజ శర్మ వేదమంత్రోచ్చారణల మధ్య గురుపౌర్ణమి విశేష పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యే ఆలయ అర్చకుల నుంచి ఆశీర్వాదాలు స్వీకరించి రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం గురుపౌర్ణమి సందర్భంగా శివంపేటకు చెందిన ఎడ్ల రమణారెడ్డి, ఎడ్ల దయానంద రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వందలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి గురుపౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.




