Narsapur: విద్యే భవిష్యత్తుకు బంగారు బాట: జడ్జి ఎం. హేమలత
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ పీఎం శ్రీ స్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు. జడ్జి ఎం. హేమలత హాజరై విద్యార్థులకు విద్యా హక్కుపై అవగాహన కల్పించారు.
Narsapur: విద్యే భవిష్యత్తుకు బంగారు బాట: జడ్జి ఎం. హేమలత
నర్సాపూర్ మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో విద్యార్థుల్లో విద్య పట్ల చైతన్యం పెంపొందించే లక్ష్యంతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. "విద్యనే భవిష్యత్ తరాలకు బంగారు బాట" అనే సందేశంతో నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు విద్య హక్కు, నైతిక విలువలు, రాజ్యాంగం కల్పించిన అవకాశాలపై అవగాహన కల్పించారు.
జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ,
మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి ఎం. హేమలత ఆధ్వర్యంలో నర్సాపూర్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో "విద్య యొక్క ప్రాముఖ్యత" అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడం, విద్య హక్కుపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డి. తారాసింగ్, నర్సాపూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, లీగల్ సర్వీస్ న్యాయవాదులు కాట్రోత్ రాజు నాయక్, మధుశ్రీ శర్మ, ప్రధానోపాధ్యాయులు సామ్య నాయక్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగం ప్రకారం విద్య ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు అని, చదువుతోనే వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించవచ్చని తెలిపారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా అభ్యసించాలని సూచించారు. విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు అలవర్చుకోవాలని, బాలల హక్కులు, విద్యా హక్కు, రాజ్యాంగం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ఉపాధ్యాయులు, లీగల్ సర్వీస్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విద్యే భవిష్యత్తుకు బంగారు బాట... ప్రతి చిన్నారికి విద్య అందేలా అందరూ బాధ్యతగా ముందుకు రావాలని వక్తలు పిలుపునిచ్చారు.




