Narsapur: ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్ శివదయాల్

Narsapur: నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిని డీసీహెచ్ శివదయాల్ సందర్శించి వైద్య సేవలు, ఎన్సీడీ విభాగం, పారిశుద్ధ్య తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.

G Ashok Reddy, Narsapur
Published on: 1 Sept 2026 9:09 PM IST
Narsapur
X

Narsapur: ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీసీహెచ్ శివదయాల్

నర్సాపూర్: నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిని డిసిహెచ్ శివదయాల్ మంగళవారం సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి వైద్యుల మరియు సిబ్బందితో సేవల వివరాలను తెలుసుకున్నారు.

మాతృత్వ, చిన్నపిల్లల వైద్య సేవలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, NCD విభాగాల పనితీరును డిసిహెచ్ పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన పరీక్షలు, చికిత్సలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్యం అందేలా అన్ని విభాగాల వైద్యులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని శివదయాల్ సూచించారు. రోగులు, వారి సహాయకులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

NCD సేవలు మరింత సమర్థవంతంగా

మధుమేహం, అధిక రక్తపోటు వంటి అంటువ్యాధులు కాని వ్యాధుల గుర్తింపు, పరీక్షలు, చికిత్స, ఫాలోఅప్ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. NCD సేవలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

ఆహారం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

రోగులకు అందించే ఆహారం పరిశుభ్రంగా, నాణ్యతతో, పోషక విలువలతో ఉండేలా చూడాలని డిసిహెచ్ సూచించారు. ఆసుపత్రి ప్రాంగణం, వార్డుల్లో ఎల్లప్పుడూ పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. డైట్, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

సిబ్బంది తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలి

విధుల్లో ఉన్న సమయంలో అన్ని స్థాయిల ఉద్యోగులు తప్పనిసరిగా ID కార్డులు ధరించాలని సూచించారు. దీనివల్ల రోగులు, వారి సహాయకులు సిబ్బందిని సులభంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి.

ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు HODలు, ఫ్యాకల్టీ వారీగా బాధ్యతలను స్పష్టంగా కేటాయించి, ప్రతి విభాగం పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని డిసిహెచ్ శివదయాల్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ వంశీ కృష్ణ, rmo రాజేష్ కుమార్ తో పాటు సీనియర్ వైద్యులు జయప్రకాశ్ తో పాటు వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story