Narsapur: నర్సాపూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన, దిష్టిబొమ్మ దహనం

Narsapur: ఢిల్లీలో కాంగ్రెస్ నేతల అరెస్ట్‌కు నిరసనగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ర్యాలీ, మానవహారం. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 22 July 2026 2:41 PM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన, దిష్టిబొమ్మ దహనం

నర్సాపూర్: ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

నిరసన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నేతలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తూ, కాంగ్రెస్ నేతల అరెస్టులు ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలని ఆరోపించారు.

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్షాల గొంతును అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని నాయకులు స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story