Narsapur: నర్సాపూర్‌లో బీజేపీ భారీ ధర్నా 22ఏ భూముల సమస్యపై ఎంపీల గర్జన!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 22ఏ భూముల సమస్యపై బీజేపీ భారీ ధర్నా. హాజరైన ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
Narsapur: నర్సాపూర్‌లో బీజేపీ భారీ ధర్నా 22ఏ భూముల సమస్యపై ఎంపీల గర్జన!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 22ఏ నిషేధిత భూముల అంశంపై బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. 22ఏ జాబితాలో ఉన్న భూముల పూర్తి వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని, అర్హులైన రైతులు, పేదలకు న్యాయం చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
ధర్నాకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రైతులకు అన్యాయం జరుగుతోంది: విశ్వేశ్వర్ రెడ్డి
22ఏ భూముల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన అంటూ సంబరాలు చేసుకుంటోందని, కానీ రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని విమర్శించారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధరణి, భూభారతి వ్యవస్థలపై విమర్శలు చేస్తూ.. గత, ప్రస్తుత ప్రభుత్వాలు రైతుల భూ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.
రైతుల కోసం బీజేపీ పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతుగా పనిచేస్తోందని అన్నారు. రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, రైతులపై వడ్డీ భారం పడుతోందని విమర్శించారు.
సెప్టెంబర్ 7లోగా 22ఏ సమస్య పరిష్కరించాలి: రఘునందన్ రావు
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. 15 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లను కూడా 22ఏ కింద చేర్చారని విమర్శించారు.
చిప్పల్చర్తి, నవాపేట, సికింద్లాపూర్ తదితర ప్రాంతాల్లో భూముల సమస్యలను ప్రస్తావిస్తూ.. రైతులకు న్యాయం జరిగిందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సెప్టెంబర్ 7లోగా 22ఏ జాబితా నుంచి అర్హులైన భూములను తొలగించి రైతులకు న్యాయం చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
ధరణి తర్వాత రికార్డుల్లో మార్పులు: ఈటల రాజేందర్
ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ధరణి వచ్చిన తర్వాత భూముల రికార్డుల్లో మార్పులు జరిగాయని ఆరోపించారు. కాస్తుదారు, భూయజమాని వివరాలు తొలగించి కొన్ని భూములను ప్రభుత్వ భూములుగా మార్చారని విమర్శించారు.
60 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూములను సైతం ఇప్పుడు 22ఏ జాబితాలో చేర్చారని ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు.
పేద ప్రజలు, రైతుల పక్షాన బీజేపీ నిలబడి పోరాటం చేస్తుందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. భూ హక్కుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.




