Narsapur: వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలి.. బీజేపీ డిమాండ్
Narsapur: నర్సాపూర్ వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ (MRO)కు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు.
Narsapur: వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలి.. బీజేపీ డిమాండ్
Narsapur: నర్సాపూర్ కేంద్రం వద్ద ప్రభుత్వం అందించిన రవాణా అందుబాటులో లేనందున వరి సేకరణ (ధాన్యం కొనుగోలు) కేంద్రంలో వడ్ల కొనుగోలు పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలని, రుతుపవనాలు రాకముందే ప్రతి గింజను కొనుగోలు చేయాలని కోరుతున్నాము.
ఇటీవల అకాల కురిసిన వర్షాల వల్ల మొలకెత్తిన ధాన్యం గింజలను కూడా కొనుగోలు చేయాలి. లారీలు, హమాలీలు కొరత లేకుండా చూడాలని కోరుతున్నాము. రవాణా కొరత కారణంగా రైతులు ఒక ట్రిప్పుకు రూ. 1500 నుండి రూ. 2500 చొప్పున ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
ధాన్యం సేకరణ ఆలస్యం కావడం కారణంగా చిన్న, సన్నకారు రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలుకు రూ. 1200/- నుండి రూ. 1400/- కే విక్రయించాల్సి వస్తుంది. దయచేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే సేకరించాలని కోరుచున్నాము.
వచ్చే సీజన్‌లో విత్తనాలు కొనేందుకు, సకాలంలో ఎం.ఎస్.పి (MSP) చెల్లింపులపై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో మీరు చొరవ చూపి న్యాయం చేయాలని మేము కోరుచున్నాము, డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రఘువీర్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్ మన్నే నిరంజన్ దాస్, పట్టణ అధ్యక్షులు చంద్రయ్య,, జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్ గారు,జిల్లా కార్యదర్శి బాలరాజు,, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గుండం శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు రామ్ రెడ్డి, సంఘసాని రాజు,బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.




