Narsapur: రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్
Narsapur: నర్సాపూర్‌లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ ఆకస్మిక దాడులు. నాణ్యత లేని ఆహార పదార్థాల వాడకంపై హెచ్చరిక.
Narsapur: రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్
Narsapur: నర్సాపూర్ పట్టణంలోని పలు రెస్టారెంట్లతో పాటు టిఫిన్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ నర్సాపూర్ పట్టణంలో ఉన్న హోటల్లను ఆకస్మికగా తనిఖీ చేసి వంటలలో నాణ్యమైన వస్తువులు, పదార్థాలు వాడాలని మరియు వంట చేసే టప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని మరియు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడరాదని తెలియజేస్తూ, హోటల్ యాజమాన్యానికి సిబ్బందికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. నాణ్యత ప్రమాణాలలో ఏమాత్రం తేడా వచ్చినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హోటల్ యజమానులను హెచ్చరించారు. ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు కల్తీ నూనెలు కానీ, ఎటువంటి నాసిరకం పప్పులు కానీ పిండి కానీ ఉపయోగించకూడదని హెచ్చరించారు నాసిరకం ఆహార పదార్థాలు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుద్దని ఒకవేళ నాసిరకం పదార్థాలు అమ్మిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో సానిటరీ ఇంచార్జ్ ఉదయ్ కుమార్ మరియు పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.




