Hathnoora: ఉపాధి కూలీలకు ఊరట నస్తీపూర్‌లో చలువ పందిరి, రాగి జావ పంపిణీ

Hathnoora: హత్నూర మండలం నస్తీపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీల కోసం సర్పంచ్ ప్రమీల సాయిలు ఆధ్వర్యంలో చలువ పందిరి, రాగి జావ మరియు చల్లటి మంచి నీటి సౌకర్యాలు కల్పించారు.

G Ashok Reddy, Narsapur
Published on: 14 May 2026 12:19 PM IST
Hathnoora
X

Hathnoora: ఉపాధి కూలీలకు ఊరట నస్తీపూర్‌లో చలువ పందిరి, రాగి జావ పంపిణీ

హత్నూర: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లోని నస్తీపూర్ గ్రామం లో సర్పంచ్ ప్రమీల సాయిలు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు చలువ పందిరి వేసి రాగి జావ,చల్లటి మంచి నీటి సౌకర్యం కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంపిడిఓ శంకర్ మాట్లాడుతూ తీవ్రమైన ఎండలు ఎక్కువగా ఉండటంతో పని ప్రదేశంలో కూలీలు వడదెబ్బ తగలకుండా చలువ పందిరి వేయించిన సర్పంచ్ ప్రమీల సాయిలు ను అభినందించారు.

శరీరం ఎండకు చలువనీయడం కోసం రాగి జావ చాలా ఉపకరిస్తుందన్నారు. కూలీలు కూడా ఉదయాన్నే పనికి వచ్చి, మీకు కేటాయించిన కొలతలు పూర్తి చేసుకొని ఎండా తీవ్రత పెరగకముందే ఇండ్ల లోకి చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎల్లమ్మ, దశరథ, కళ్యాణ్ రాజ్,బిఆర్ఎస్ నాయకులు సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు, మేట్‌లు సువర్ణ,సత్యమ్మ, లక్ష్మీ,వీరమణి,ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story