Narsapur: ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరం ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు.
Narsapur: ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరం ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరాన్ని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవగాహన, ముందస్తు నిర్ధారణ ద్వారా క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు.
శిశిర ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో మహిళలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ సింధుతో పాటు ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అలాగే మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రజలు ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు.




