Medak: శభాష్‌పల్లిలో EV ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్‌రావు
Medak: మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్‌పల్లిలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఎంపీ రఘునందన్‌రావు ప్రారంభించారు.
Medak: శభాష్‌పల్లిలో EV ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించిన ఎంపీ రఘునందన్‌రావు
మెదక్ నర్సాపూర్: శివంపేట మండలం శభాష్‌పల్లి గ్రామంలో NH-44పై నూతనంగా ఏర్పాటు చేసిన EV ఛార్జింగ్ స్టేషన్‌ను మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో ఇంధన అవసరాల కోసం భారీగా విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోందని, భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ కోసం దేశాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితులు రాకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచిస్తున్నారని తెలిపారు.
ప్రతి ఇంటికీ సోలార్ వ్యవస్థ
ప్రతి ఇంటిపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఎంపీ సూచించారు. సోలార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడం ద్వారా విద్యుత్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడవచ్చన్నారు.
పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని, గ్రామీణ ప్రాంతాల్లోనూ మరిన్ని EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రజలు, వ్యాపారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
బ్రాహ్మణపల్లి రైల్వే బ్రిడ్జికి హామీ
తూప్రాన్–శివంపేట మధ్య బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన రఘునందన్‌రావు.. నెల రోజుల్లో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేయించి, బ్రాహ్మణపల్లి రైల్వే బ్రిడ్జి మంజూరుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




