Chilipched: తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ధర్నా!
Chilipched: చిల్పచేడ్ తహసీల్దార్ ఆఫీస్ వద్ద కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కొనసాగింపు కోరుతూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ధర్నా చేపట్టారు.
Chilipched: తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ధర్నా!
చిల్పచేడ్: పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చిల్పచేడ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హయాంలో ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, అర్హులైన ప్రతి కుటుంబానికి సకాలంలో ఆర్థిక సహాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. పథకాలను కొనసాగించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు కూడా వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి సంబంధించిన పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మీ పథకాలను కంటిన్యూ చేయాలని చెలిపి చెడ్ తహసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాతో చిల్పచేడ్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రాజకీయ వాతావరణం వేడెక్కింది.




