Narsapur: కల్లాల వద్దే పేరుకుపోయిన ధాన్యం రోడ్డెక్కిన నర్సాపూర్ రైతులు

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 12 May 2026 3:02 PM IST
Narsapur
X

Narsapur: కల్లాల వద్దే పేరుకుపోయిన ధాన్యం రోడ్డెక్కిన నర్సాపూర్ రైతులు

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి శివంపేట మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు గత వారం పది రోజులుగా కల్లాల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయిందని కొనుగోలు సాగడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు శివంపేట మండలంలోని చిన్న గొట్టిముక్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు కౌడిపల్లి మండల కేంద్రంలో కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించగా ఆందోళనకు మద్దతుగా టిఆర్ఎస్ నాయకులతో పాటు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని రైతులకు మద్దతు ప్రకటించారు

అకాల వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హెచ్చరించారు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయిందని ఇక్కడ కూడా కొనుగోలు సరిగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలలో వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story