Medak: ఇందిరమ్మ ఇళ్ల పండుగ.. 17 లక్షల ఇళ్లే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం!
Medak: నర్సాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన. 5 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యమని వెల్లడి.
Medak: ఇందిరమ్మ ఇళ్ల పండుగ.. 17 లక్షల ఇళ్లే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం!
మెదక్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటని.. మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలను లబ్ధిదారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఇందిరాగాంధీ ఆ రోజుల్లో పేద ప్రజలకు గరీబి హటావో అనే నినాదంతో అసైన్డ్ భూములు, ఇందిరమ్మ ఇల్లు నిర్మించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని చెప్పి లబ్ధిదారులకు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. .
మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. గత బిఆర్ఎస్ పార్టీ నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు మోసం చేసింది అన్నారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఒక గ్యారెంటీ ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగాఈరోజు నరసాపూర్ లో నియోజకవర్గంలో 3500 ఇండ్లు కట్టుకోవడం జరుగుతుంది అన్నారు.
ఈ సందర్భంగా 192 ఇండ్ల నిర్మాణం జరుగుతోంది అన్నారు.. 100 ఇందిరమ్మ ఇండ్లు రెడీ ఉన్నాయి. త్వరలో అన్నీ కూడా ప్రారంభిస్తామన్నారు.. మొదటి దపాలో ఇందిరమ్మ ఇల్లు రానివారికి వచ్చే సంవత్సరంలో ఇంకొక 2,500 ఇల్లు మంజూరు చేస్తామన్నరు. అర్హులైన పేదలందరికీ ఈ ఇండ్లు వచ్చేలా చూస్తామాన్నారు..అందరూ ఓపిక పట్టలన్నారు.. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే స్తోమత లేనటువంటి అర్హులకు కాంగ్రెస్ కార్యకర్తలు సహాయం చేసి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత తీసుకోవాలని సూచించారు..ఐదు సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రంలో 17 లక్షల ఇండ్లు నిర్మించాలని రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని దానికి అందరు దీనికి సహకరించాలని కోరారు.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నర్సాపూర్ నియోజకవర్గంలో 100 శాతం అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.. 600 స్క్వేర్ ఫీట్స్ కన్నా తక్కువ స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలన్నారు.. దింతో దానికి సంబంధించినబిల్లు కూడా వెంటనే జనరేట్ అవుతుందన్నారు.. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల సరిగ్గా రాని విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల్లో క కలెక్టర్ తో రివ్యూ మీటింగ్ పెట్టడం జరుగుతుందని. దానికి సంబంధించిన పూర్తి వివరాలు దగ్గర పెట్టుకొని పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి ,జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ , మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజ యాదవ్ , గ్రంధాలయ చైర్మన్ చిలె మల సుహాసినిరెడ్డి, మెదక్ ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజి రెడ్డి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.




