Medak: క్రిటికల్ కేర్ బ్లాక్‌ను తనిఖీ చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ!
Medak: మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు.
Medak: క్రిటికల్ కేర్ బ్లాక్‌ను తనిఖీ చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ!
మెదక్: ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 24: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ మెదక్ జిల్లా కేంద్రం లోని నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ను స్థానిక శాసనసభ్యులు డా. మైనంపల్లి రోహిత్ తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా క్రిటికల్ కేర్ బ్లాక్ ను త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్ల పై GGH ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సునీత దేవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా నితిన్ కబ్రా, DMHO డా. జ్ఞానేశ్వర్, DCHS డా. శివ దయాళ్, వైద్య ఆరోగ్యశాఖ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష లో PCC అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ శాసన సభ్యులు మైనంపల్లి హనుమంత రావు పాల్గొన్నారు. క్రిటికల్ కేర్ బ్లాక్ ను త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన HR ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, IHFMS సేవలను అందుబాటులోకి తేవడం పై రేపు (date. 25.08.2026) న హైదరాబాద్ సచివాలయం లో ఉన్నత స్థాయి సమావేశం కు రావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు అధికారులను ఆదేశించారు. అలాగే,GGH ఆసుపత్రి లో వైద్య సేవల బలోపేతం పై మంత్రి చర్చించారు.
GGH నూతన భవన నిర్మాణం పై చర్చించారు. మెడికల్ కాలేజీ విద్యార్థులకు హాస్టల్ నిర్మాణం పై చర్చించారు. తూప్రాన్ లో ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో నర్సాపూర్, రామాయంపేట, కౌడిపల్లి, తూప్రాన్ లలో కిడ్నీ రోగులకు అందిస్తున్న డయాలసిస్ సేవలపై చర్చించారు. మెదక్ జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవల బలోపేతానికి అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.




