Medak: ఆరోగ్య కార్డులు పనిచేయకపోవడం బాధాకరం దొంత నరేందర్

Medak: మెదక్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగ ఆరోగ్య కార్డులు ఆసుపత్రులలో పనిచేయకపోవడంపై టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆవేదన. వెంటనే పరిష్కరించాలని డిమాండ్.

NAGARAJ, MEDAK
Published on: 11 Aug 2026 11:07 PM IST
Medak
X

Medak: ఆరోగ్య కార్డులు పనిచేయకపోవడం బాధాకరం దొంత నరేందర్

మెదక్: ప్రభుత్వం ఉద్యోగులకు జారీ చేసిన ఆరోగ్య కార్డులు ఆసుపత్రులలో పని చేయకపోవడం బాధాకరమని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అన్నారు. మంగళవారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు.

జూన్ నెల ఒకటవ తారీకు నుండి ఉద్యోగుల వేతనలలో 1.5 శాతం మూడు నెలలుగా ఉద్యోగుల బీమా నిమిత్తం కోత విధిస్తున్న ఆసుపత్రులలో మాత్రం ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్య కార్డులు చెల్లుబాటు కాకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ఆసుపత్రి వర్గాలతో చర్చించి అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఉద్యోగిని లేదా ఉద్యోగి ఆధారిత కుటుంబ సభ్యులను ప్రైవేట్ బీమా సంస్థ ద్వారా వచ్చిన వ్యాధిగ్రస్తులకు చికిత్స ఏ విధంగా అందిస్తున్నారో అదేవిధంగా ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే ఉద్యోగులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారని నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హితవు పలికారు.

అనంతరం జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ పెండింగ్లో ఉన్న కరువు బత్యం తో పాటు పి ఆర్ సి నివేదిక తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటించాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, మెదక్ జిల్లాను రాజన్న జోన్ నుండి చార్మినార్ జోన్లో కలపాలని పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదింప చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాండ్ల అనురాధ, జిల్లా సహాధ్యక్షులు ఇక్బాల్ పాషా, ఉపాధ్యక్షులు అర్షద్, ఫజాలుద్దీన్, క్రీడల కార్యదర్శి గోపాల్, తూప్రాన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, నరేందర్ గౌడ్ ఏడుపాయల వన దుర్గ యూనిట్ కార్యదర్శి ప్రశాంత్, పశుసంవర్ధక శాఖ ఫోరం కార్యదర్శి లింగమూర్తి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story