Medak: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి!

Medak: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో పాపన్నపేటకు చెందిన ఆకుల కృష్ణ (40) అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.

NAGARAJ, MEDAK
Published on: 10 Aug 2026 5:13 PM IST
Medak
X

Medak: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి!

మెదక్ ఆగస్టు 10: పాపన్నపేట్ ఎదురు ఎదురుగా ద్విచక్ర వాహనాలు డి కొనగా ఒకరు మృతి చెందిన సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్ పేట గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి పాపన్నపేట గ్రామానికి చెందిన ఆకుల కృష్ణ (40) ద్విచక్రవాహనం పై బావ మరిది వెంకట్ తోకొత్తపల్లినుండివైపుపాపన్నపేటవైపువెళుతున్నక్రమంలో ముస్లాపూర్ గ్రామానికి చెందిన కటికే వారు ఇరువురు ద్విచక్రవాహనం పై ముస్లాపూర్ నుండి మెదక్ వైపు వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని డి కొనడం తో వెనుక కూర్చున్న కృష్ణ ఎగిరి

రోడ్డు పై పడి తలకు తీవ్ర గాయాలు కావడం తో తీవ్ర రక్త స్రవం కావడం తో ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే 108,పాపన్నపేట పోలీసులకు సమాచారం అందివ్వడం తో పాపన్నపేట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానకి చేరుకొని క్షత్తగాత్రులను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగామార్గమధ్యం లోనే కృష్ణ మృతి చెందినట్లు పరీక్షించినడాక్టర్లునిర్ధారించారు. కాగా మృతుడికి భార్య, ఓ కూతురు ఉన్నారు. పాపన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story