Medak: రెడ్డిపల్లిలో నూతన కూరగాయల మార్కెట్ ప్రారంభం!
Medak: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో నూతన వారపు కూరగాయల మార్కెట్‌ను సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ ప్రారంభించారు.
Medak: రెడ్డిపల్లిలో నూతన కూరగాయల మార్కెట్ ప్రారంభం!
Medak: రెడ్డిపల్లిలో నూతన కూరగాయల మార్కెట్ ప్రారంభం నర్సాపూర్ మండలం రెడ్డి పల్లి గ్రామం లో నూతనంగా కూరగాయల మార్కెట్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్.
తమ గ్రామ ప్రజలకు నాణ్యమైన, తాజా కూరగాయలు అందుబాటులో ఉంచే లక్ష్యంతో రెడ్డిపల్లి గ్రామంలో నూతన కూరగాయల మార్కెట్‌ను గ్రామ సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్ ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రైతులు వారికి కూరగాయల మార్కెట్‌ను ఉపయోగించుకోవాలని సర్పంచ్ పేర్కొన్నారు.
రైతులు పండించిన కూరగాయలను నేరుగా వినియోగదారులకు అందించేందుకు ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఆదివారం మార్కెట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మార్కెట్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు గ్రామ ప్రజలకు తాజా కూరగాయలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు గ్రామ పంచాయతీ కట్టుబడి ఉందన్నారు.
నూతన మార్కెట్ ప్రారంభం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




