Narsapur: నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో డెంగ్యూ నివారణ దినోత్సవం!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 16 May 2026 11:37 AM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో డెంగ్యూ నివారణ దినోత్సవం!

నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డెంగ్యూ నివారణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దాని లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయ ప్రకాష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి రాకుండా నివారణ చర్యలు ప్రజలకు సూచించారు ముఖ్యంగా మురికి నీళ్లు ఉండకుండా చూసుకోవాలని చూసుకోవాలని అన్నారు.

ఎవరికైనా జ్వరం వచ్చి రెండు మూడు రోజులైనా తగ్గకపోతే సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి తగు పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అలాగే అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story