Medak: భారత రాజ్యాంగం ప్రకారం "ఒక వ్యక్తికి ఒకే ఓటు".. కానుగు రాధిక
Medak: మెదక్ పట్టణంలోని 24వ వార్డులో జరిగిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధికా భూపతి రాజు పాల్గొన్నారు.
Medak: భారత రాజ్యాంగం ప్రకారం "ఒక వ్యక్తికి ఒకే ఓటు".. కానుగు రాధిక
Medak: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం మెదక్ పట్టణంలోని 24 వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ లో మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్డీఓ లతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం "ఒక వ్యక్తి కి ఒకే ఓటు" అనే నినాదంతో ఓటర్ల జాబితాలో పారదర్శకత ఉండాలని తెలిపారు.
అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా అన్యాయంగా తొలగించబడకుండా చూడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




