Medak: మెదక్‌లో శిశువు విక్రయం ఘటనపై ఎమ్మెల్యే రోహిత్ రావు ఫైర్: బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం!
Medak: మెదక్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడ శిశువును విక్రయించిన ఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తీవ్రంగా స్పందించారు.
Medak: మెదక్‌లో శిశువు విక్రయం ఘటనపై ఎమ్మెల్యే రోహిత్ రావు ఫైర్: బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం!
మెదక్: నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు విషాదం నింపే విధంగా ఆసుపత్రి సిబ్బంది వ్యవహరిస్తే ఏ పార్టీ వారైనా ఎవరిని ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ పట్టణంలో ఓ మహిళ ఆడబిడ్డకు జన్మనివ్వగా చనిపోయింది అంటూ ప్రైవేట్ ఆస్పత్రికి సిబ్బంది ఆడ శిశువును ఇతరులకు అమ్ముకున్న ఘటనపై ఎమ్మెల్యే రోహిత్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే బాధ్యులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఏ పార్టీ వారైన ఎంతటి అధికారులు తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.మానవత్వం మంటగలిగే విధంగా వ్యవహరించిన ఆసుపత్రికి సిబ్బంది ప్రవర్తించిన తీరు నాకెంతో బాధ కలిగించిందన్నారు. నవ మాసాలు మోసిన ఆ కన్నతల్లి సంతోషం లేకుండా కన్నీళ్లు మిగిల్చిన వారిని వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలని ఆయన పునరుద్ధరించారు.




