Medak: రైతు మృతిపై కలెక్టర్ స్పష్టత.. ఆ వార్తలు అవాస్తవం!
Medak: మెదక్ జిల్లా చిన్న గణపూరు రైతు శంకరయ్య మృతిపై జిల్లా కలెక్టర్ శనివారం స్పష్టతనిచ్చారు.
Medak: రైతు మృతిపై కలెక్టర్ స్పష్టత.. ఆ వార్తలు అవాస్తవం!
మెదక్: మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గణపూరు గ్రామంలో వెంకటాపురం శంకరయ్య అనే రైతు అకాల మరణం అనే వార్తను పలు పత్రికలు ప్రచురించిన దృశ్య ఆ వార్తలో కొన్ని పత్రికలు నిజాన్ని వక్రీకరించి రాసినట్లు జిల్లా కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు అకాల మరణం పట్ల కుల్చారం మండల తహసీల్దార్ (MRO) నివేదిక ప్రకారం, సంబంధిత రైతు గుండెపోటుతోనే మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని తెలియజేసిన ట్లు నివేదికలో పేర్కొనబడినది.
సంబంధిత రైతు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వం నిర్ణయించిన సీరియల్ విధానం ప్రకారమే కొనసాగుతున్నది. అయితే కొన్ని దినపత్రికలలో ధాన్యం కొనుగోలు సమస్యల కారణంగానే రైతు మృతి చెందినట్లు ప్రచురించబడిన వార్త అవాస్తవమని తెలియజేయడమైనది. దీనిని ధాన్యం కొనుగోళ్ల సమస్యలతో ముడిపెట్టి ప్రచారం చేయడం పూర్తిగా నిరాధారమని స్పష్టం చేయడమైనది.
మెదక్ జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయబడగా, 30,210 మంది రైతుల ఖాతాల్లో రూ.336.65 కోట్లను నేరుగా జమ చేయడం పూర్తయింది.
నిరంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షలు నిర్వహిస్తూ, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ కొనుగోలు కేంద్రాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నరు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.కావున రైతులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేయడమైనది.




