Medak: అల్-ఇన్-వన్ టూరిజం హబ్ మెదక్.. వీకెండ్ ప్లాన్ కోసం బెస్ట్ ఆప్షన్
Medak: వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడపాలనుకునే వారికి మెదక్ జిల్లా అద్భుతమైన వేదిక.
Medak: అల్-ఇన్-వన్ టూరిజం హబ్ మెదక్.. వీకెండ్ ప్లాన్ కోసం బెస్ట్ ఆప్షన్
Medak: పరీక్షల ఒత్తిడితో అల సిపోయిన విద్యార్థులు, రోజువారీ పనులతో విసిగిపోయిన తల్లిదండ్రులు వేసవిలో హాయిగా గడపడానికి ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించే వారికి మెదక్ జిల్లా ఒక అద్భుతమైన ఎంపిక. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు—అల్ ఇన్ వన్ గా మెదక్ జిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వన దుర్గాభవాని, ఆసియా ఖండంలోనే ప్రముఖమైన మెదక్ చర్చి, చా రిత్రక మెదక్ ఖిల్లా, ప్రకృతి సోయగాలతో నిండిన పోచారం అభయారణ్యం, కొల్చారంలోని బౌద్ధ క్షేత్రం. నర్సాపూర్ అడవి పర్యటక ప్రాంతం. మంజీరా నది ఒడ్డున పురాతనమైన చామండేశ్వరి ఆలయం వంటి అనేక ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఏడుపాయల దుర్గాభవాని - విశిష్ట పుణ్యక్షేత్రం
మెదక్ జిల్లాలోని అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఏడుపాయలవన దుర్గాభవాని ఆలయం ఒకటి. మంజీరా నది ఏడుగా చీలి మళ్లీ కలిసే అరుదైన ప్రకృతి విశేషం ఇక్కడ కనిపిస్తుంది.పురాణాల ప్రకారం జనమేజయుడు ఇక్కడ సర్పయాగం చే సినట్లు విశ్వాసం. నేటికీ అక్కడి మట్టిలో విభూతి లభించడం విశేషం. రాతి గుహలో కొలువైన వనదుర్గ భవాని దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఆల యాన్ని విస్తరించి భక్తులకు సులభ దర్శనం కల్పించారు. హరిత రిసార్ట్స్, వసతి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
మెదక్ చర్చి – ఆధ్యాత్మికతకు ప్రతీక..
మెదక్ పట్టణానికి తలమానికంగా నిలిచే మెదక్ కేథడ్రల్ చర్చి ఆసియా ఖండంలోనే ప్రముఖ చర్చిలలో ఒకటి. సుమారు 200 అడుగుల ఎత్తుతో గోతిక్ శైలిలో నిర్మించిన ఈ చర్చి అందాన్ని చూసినవారిని అబ్బురపరుస్తుంది. ప్ర పంచంలోని రెండవ అతి పెద్ద చర్చిగా దీనికి గుర్తింపు ఉంది. చర్చి లోపల గాజు పెంకులతో రూపొందించిన క్రీస్తు జీవితం చిత్రాలు ప్రత్యేక ఆకర్షణ. ఒకేసారి ఐదు వేల మంది ప్రార్థన చేయగలిగే విశాల హాల్ ఈ చర్చికి ప్రత్యేకత, రంగూన్ టేకు, రోజుడ్తో తయారు చేసిన వేదికలు కళాత్మకతను ప్రతిబింబిస్తాయి.
ప్రత్యేకత:1914లో కరువు సమయంలో ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్చి నిర్మాణం ప్రారంభమై 1924లో పూర్తయింది.
చేరుకునే మార్గం: హైదరాబాద్ నుండి సుమారు 97 కి. మీ దూరంలో ఉన్న మెదక్కు మేడ్చల్, తూప్రాన్, నర్సాపూర్ మార్గాల్లో బస్సులు అందుబాటులో ఉన్నాయి.
జీనికల ప్రత్యుత్పత్తి కేంద్రo పోచారం అభయారణ్యం
మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతం మెదక్ నుండి సుమారు 12 కి.మీ హైదరాబాద్ నుండి సుమారు 85-97 కి. మీపోచారం అభయారణ్యం -ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.130 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించిన పోచారం అభయారణ్యం వన్యప్రాణులకు లయం. నిజాం కాలంలో వేట ప్రాంతంగా ఉపయోగించబడిన ఇది ప్రస్తుతం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా మారింది. ఇక్కడ జింకలు, తోడేళ్లు, అడవి కుక్కలు, చిరుతలు వంటి జంతువులు కనిపిస్తాయి.
పోచారం రిజర్వాయర్ వద్ద విదేశీ పక్షులు వలస రావడం
ప్రత్యేక ఆకర్షణ. హరిత రిసార్ట్స్, పార్కులు పర్యాటకులకు మంచి విశ్రాంతిని అందిస్తాయి.
సందర్శన సమయం: ఉదయం 8 గంటల నుండి
సాయంత్రం 6 గంటల వరకు. మెదక్ ఖిల్లా చరిత్రకు సాక్ష్యంకాకతీయుల కాలానికి చెందిన మెదక్ ఖిల్లా చారిత్రక ప్రాధాన్యం కలిగిన కోట. సుమారు 300 అడుగుల ఎత్తైన కొండపై నిర్మించబడిన ఈ కోట 400 ఎకరాల్లో విస్తరించి ఉంది. సింహ ద్వారం, గజ ద్వారం వంటి ప్రధాన ద్వారాలు, ఫిరంగులు, ధాన్యాగారాలు కోట ప్రత్యేకతలు. ముబారక్ మహల్ అనే రాజమందిరాన్ని ప్రస్తుతం హోటల్ గా మార్చడం విశేషం.
దూరం: మెదక్ పాత బస్టాండ్ నుండి సుమారు 1కి.మీ..
హైదరాబాద్ సమీపంలోని నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ కేంద్రంలో అడవిలో మంచి లొకేషన్ ఉండటం అడవి చూపులను ఆకట్టుకు ంది అటవీ అధికారులు అడవి కేంద్రంలో గెస్ట్ హౌస్ లను సైతం నిర్మాణం చేపట్టారు అడవిలో ఉండడానికి పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు..
ఎందుకు మెదక్ వెళ్లాలి? ఆధ్యాత్మిక + పర్యాటక + చారిత్రక అనుభవం ఒకేచోట.కుటుంబంతో గడపడానికి అనువైన వాతావరణంప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం తక్కువ ఖర్చుతో మంచి విహారం ముగింపువేసవిలో చల్లని అనుభూతి, ఆధ్యాత్మిక శాంతి, ప్రక్మి అందాలను ఒకేసారి ఆస్వాదించాలనుకుంటే మెదక్ జిల్లా అనువైన ప్రదేశం. చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకుని కుటుంబంతో కలిసి వెళ్లి ఆనందంగా గడపవచ్చు.




