Medak: మెదక్ కాంగ్రెస్ ఎస్.సి. కమిటీల కసరత్తు

Medak: మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ ఎస్.సి. డిపార్ట్మెంట్ కమిటీల నియామకం కోసం దరఖాస్తులు స్వీకరించారు.

G Ashok Reddy, Narsapur
Published on: 12 May 2026 4:52 PM IST
Medak
X

Medak: మెదక్ కాంగ్రెస్ ఎస్.సి. కమిటీల కసరత్తు

Medak: మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎస్.సి. డిపార్ట్మెంట్ గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కమిటీలకు దరఖాస్తు స్వీకరించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ జిల్లా అబ్జర్వర్ రాజభద్రయ్య గార్లు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలను కూడా బలోపేతం చేస్తుందాని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా SC డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్ మరియు మండల స్థాయి కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల ఎవరైనా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఇప్పటి వరకు 15 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ దరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర SC చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు దరఖాస్తులను పరిశీలించి పార్టీ కోసం పనిచేసిన వారికి నిష్పక్షపాతంగా ఎంపిక చేయడం జరుగుతుంది అని అన్నారు

ఈ కార్యక్రమంలో ఎస్ సి డిపార్ట్మెంట్ మాజీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, బ్లాక్ కాంగ్రెస్ అజిత్ మూల్సాబ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దుర్గేష్,రవి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story