Medak: ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక మెదక్ లో ఘనంగా ప్రారంభమైన హెల్త్ వీక్

Medak: మెదక్ జిల్లాలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈట్ రైట్ - వాక్ ర్యాలీ. కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆధ్వర్యంలో హెల్త్ వీక్ ప్రారంభం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 April 2026 11:18 AM IST
Medak
X

Medak: ప్రజా పాలన 99 రోజుల ప్రణాళిక మెదక్ లో ఘనంగా ప్రారంభమైన హెల్త్ వీక్

మెదక్: 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆహార భద్రతపై ప్రత్యేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ఈట్ రైట్ - వాక్ కార్యక్రమాన్ని నిర్వహించగా, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి రాందాస్ చౌరస్తా వరకు వాకింగ్ కార్యక్రమం నిర్వహించారు.

పోలీస్ డిపార్ట్మెంట్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ పై పటిష్ట చర్యలు చేపట్టారు.

ఈట్ రైట్ ఫైట్ డీసీజ్, హెల్త్, ఫుడ్ సేఫ్టీ, సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ, ఎడ్యుకేషన్, ఫారెస్ట్, పోలీస్ స్పోర్ట్స్, ఇరిగేషన్, మత్స్యశాఖ, ఇండస్ట్రీస్ జిల్లా పరిషత్,వివిధ శాఖల జిల్లా అధికారులు వారి సిబ్బంది, పాల్గొన్నారు ఈరోజు సరైన ఆహారం ఆరోగ్య భవిష్యత్తు, ప్లే కార్డులు చేత బూని నినాదాలు చేస్తూ ప్రజలకు ఆవగాహన కల్పిస్తూ రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.రాందాస్ చౌరస్తాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ హెల్త్ వీక్ కార్యక్రమంపై సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' - 99 రోజుల కార్యాచరణ లో భాగంగా ఈరోజు నుండి వారం రోజులపాటు హెల్త్ వీక్ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. జిల్లాలోని ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యం కోసం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండి, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి సహజ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుని శరీరానికి చక్కటి వ్యాయామాన్ని అందించి

ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డి .సి హెచ్ డాక్టర్ శివ దయాల్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఎఫ్ఓ జో.జి, డీఈఓ విజయ, బి డబ్ల్యు.ఓ హేమ భార్గవి,ఇరిగేషన్ ఈ.ఈ శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, క్రీడల నిర్వహణ అధికారి రమేష్, మత్స్య శాఖ అధికారి, మున్సిపాలిటీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story