Medak: మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జోరు: చివరి గింజ వరకు కొంటాం - కలెక్టర్ ప్రతిమసింగ్

Medak: మెదక్ జిల్లాలో 533 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమసింగ్ తెలిపారు.

NAGARAJ, MEDAK
Published on: 8 May 2026 8:37 PM IST
Medak: మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జోరు: చివరి గింజ వరకు కొంటాం - కలెక్టర్ ప్రతిమసింగ్
X

మెదక్: రైతు సంక్షేమంలో భాగంగా మెదక్ జిల్లాలో 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

శుక్రవారం జిల్లాలోని ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై కలెక్టర్ గారు ఒక ప్రకటన విడుదల చేస్తూ రైతుల వద్ద నుండి చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో సంబంధిత నగదును జమ చేసే విధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వేసవి దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళలలో ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ కొనసాగించడం జరుగుతుందని, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి 67,489,480 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెసి 62.87 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడము జరిగింది అని తెలిపినారు.

అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్ల తో కప్పి ఉంచాలని కేంద్రాల నిర్వహకులకు తెలియజేయటం జరిగింది. ధాన్యం కొనుగోలు, రవాణా అంశాలలో వేసవి ఉష్ణోగ్రతతో పాటు ఇతర రాష్ట్రాలలో కొనసాగుతున్న ఎన్నికల సందర్భంగా రైస్ మిల్లుల నందు హమాలీల కొరత ఏర్పడిందని తెలిపారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యం త్వరగా ఆరబెట్టి రైస్ మిల్లులకు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని, వరి ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అందుబాటులోపరికరాలు*

జిల్లాలో అవసరం మేరకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. టార్పాలిన్లు 15540, తూకం వేసే యంత్రాలు 668 ప్యాడీ క్లీనర్లు 278 తేమ శాతం చూసే మెషిన్లు 664 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించాలని కలెక్టర్ సూచించారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story