Medak: మెదక్‌లో జూన్ 25 నుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ.. కలెక్టర్

Medak: మెదక్ జిల్లాలో తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు జూన్ 25 నుండి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం కానుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

NAGARAJ, MEDAK
Published on: 22 Jun 2026 8:38 PM IST
Medak
X

Medak: మెదక్‌లో జూన్ 25 నుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ.. కలెక్టర్

Medak: జిల్లాలోని అర్హులైన పౌరులందరూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ పేర్లను సరిచూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం ఐడీఓసి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ మాట్లాడుతూ, తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని వర్గాలు సహకరించాలని సూచించారు. జిల్లాలో ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్ 25 నుండి జూలై 24 వరకు జరుగుతుందని తెలిపారు. బూతు స్థాయి అధికారులు ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి గృహ గణన పత్రాలను అందజేస్తారని చెప్పారు.

ఓటర్లు ఆ పత్రాలను పూరించి తిరిగి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. ఓటర్లు తమ వివరాలను ఇంటర్నెట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని, ఒకవేళ ఇంట్లో లేని పరిస్థితుల్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే యువత కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఇందుకు బూతు స్థాయి అధికారుల వద్ద లభించే దరఖాస్తు పత్రాలను వినియోగించాలని సూచించారు. జూలై 31, 2026న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుందని, అనంతరం ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలిపారు.

వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 1, 2026న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో గృహ గణన ప్రక్రియ 84 శాతం పూర్తయిందని తెలిపారు. చిరునామా మార్పులు ఉన్న ఓటర్లు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గృహ గణన పత్రాలు అందని వారు లేదా బూతు స్థాయి అధికారుల వివరాల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారుల అధికారిక వెబ్సైట్లు సందర్శించవచ్చని, లేదా ఉచిత సహాయ సంఖ్య 1950 ను సంప్రదించవచ్చని తెలిపారు.

ముఖ్య తేదీలు:

- సవరణ కార్యక్రమం: జూన్ 25 నుండి జూలై 24, 2026 వరకు

- ముసాయిదా జాబితా విడుదల: జూలై 31, 2026

- అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 30, 2026 వరకు

- తుది జాబితా ప్రకటన: అక్టోబర్ 1, 2026

- అర్హత: అక్టోబర్ 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండేవారు

ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ 1950 కి కాల్.సందేహాలుంటే టోల్ ఫ్రీ 9553866388 కాల్ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు,మీడియా ప్రతినిధులు, ఎలక్షన్ సూపరెండెంట్ ,తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story