Medak: పార్టీ బలోపేతమే నా ప్రధాన లక్ష్యం నూతన కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్

Medak: మెదక్ టౌన్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన మందుగుల గంగాధర్‌ను శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి.

NAGARAJ, MEDAK
Published on: 23 May 2026 5:10 PM IST
Medak
X

Medak: పార్టీ బలోపేతమే నా ప్రధాన లక్ష్యం నూతన కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్

మెదక్: మెదక్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మందుగుల గంగాధర్ నియామకమైన సందర్భంగా శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. పార్టీ నాయకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మందుగుల గంగాధర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర నాయకులు హన్మంతరావు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పట్టణంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. కార్యకర్తల సహకారంతో పార్టీని విజయపథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసనగారి నాగరాజు, మెదక్ టౌన్ మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గడ్డం ప్రభాకర్, మంగళి సంగమేష్, జోగిపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్, బర్దిపూర్ ఉపసర్పంచ్ ఇస్తారీ శంకరయ్య, నిలకంటి సుదర్శనం, టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కోర్పుల రత్నయ్య, మెదక్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

NAGARAJ, MEDAK

NAGARAJ, MEDAK

Next Story