Kowdipally: వర్షాల నేపథ్యంలో ఎస్సై అమరేందర్ రెడ్డి ముందస్తు జాగ్రత్తలు

Kowdipally: మెదక్ జిల్లా కౌడిపల్లిలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ పరికరాలు, మోటార్ల పట్ల రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై అమరేందర్ రెడ్డి సూచించారు.

G Ashok Reddy, Narsapur
Published on: 24 Aug 2026 9:59 PM IST
Kowdipally
X

Kowdipally: వర్షాల నేపథ్యంలో ఎస్సై అమరేందర్ రెడ్డి ముందస్తు జాగ్రత్తలు

కౌడిపల్లి: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని కౌడిపల్లి ఎస్సై అమరేందర్ రెడ్డి సూచించారు. వర్షాకాలంలో నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

ముఖ్యంగా రైతులు పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్టార్టర్‌ డబ్బాలు, మోటార్లు, ఇతర విద్యుత్‌ పరికరాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఎస్సై సూచించారు. వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలు, స్టార్టర్లు, ఇతర విద్యుత్‌ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని హెచ్చరించారు.

విద్యుత్‌ పరికరాల్లో ఏదైనా సమస్య తలెత్తితే స్వయంగా మరమ్మతులు చేయకుండా సంబంధిత నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు. మరమ్మతులు చేపట్టే ముందు తప్పనిసరిగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి, భద్రతా చర్యలు పాటించిన తర్వాతే పనులు చేయాలని తెలిపారు.

వర్షాల సమయంలో విద్యుత్‌ షాక్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, రైతులు, కూలీలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అమరేందర్ రెడ్డి కోరారు. చిన్నారులను విద్యుత్‌ పరికరాలు, నీరు నిలిచిన ప్రాంతాలు, ప్రమాదకర ప్రదేశాల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వర్షాకాలంలో నిర్లక్ష్యం చేయకుండా భద్రతా చర్యలు పాటించడం ద్వారా విద్యుత్‌ ప్రమాదాలను నివారించవచ్చని ఎస్సై తెలిపారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story