Narsapur: సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్.. జడ్జి హేమలత సమీక్ష!
Narsapur: న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతంపై పోలీసు అధికారులతో జడ్జి ఎం. హేమలత సమీక్ష నిర్వహించారు.
Narsapur: సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్.. జడ్జి హేమలత సమీక్ష!
నర్సాపూర్: జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ న్యాయమూర్తి ఎం. హేమలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ, రాజీ చేయదగిన కేసుల పరిష్కారం, కక్షిదారులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎం. హేమలత మాట్లాడుతూ... రాజీ చేయదగిన కేసుల్లో ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో రాజీ కుదుర్చుకుని, సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను సత్వరంగా, సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. నర్సాపూర్ కోర్టు పరిధిలోని పోలీస్ అధికారులు రాజీ చేయదగిన కేసుల కక్షిదారులకు పూర్తి సహకారం అందించి, లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కక్షిదారులకు లోక్ అదాలత్ ప్రయోజనాలపై అవగాహన కల్పించి, ఎక్కువ సంఖ్యలో రాజీ చేయదగిన కేసులను పరిష్కరించేలా పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని న్యాయమూర్తి సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో నర్సాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రంగా కృష్ణ, నర్సాపూర్ ఎస్‌ఐ రంజిత్ రెడ్డి, చిలప్‌చేడ్ ఎస్‌ఐ నర్సింలు, నర్సాపూర్ ఎక్సైజ్ ఎస్‌ఐ రాఘవేందర్ రావు, కౌడిపల్లి డబ్ల్యూఏఎస్‌ఐ అండాలు, పోలీస్ కోర్టు కానిస్టేబుళ్లు, లీగల్ సర్వీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.




