Narsapur: ఆస్పత్రికి వెళ్లాల్సినోడు.. వైన్స్ ముందు అడ్మిట్!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కాలికి గాయమైనా లెక్కచేయకుండా మందు కోసం వైన్స్ షాపు ముందుకు వచ్చి పడకేసిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Narsapur: ఆస్పత్రికి వెళ్లాల్సినోడు.. వైన్స్ ముందు అడ్మిట్!
Narsapur: “ఆస్పత్రికి వెళ్లాల్సినోడు.. వైన్స్ ముందు అడ్మిట్! కాలికి గాయం ఉన్నా మందు కోసం మానని ఆరాటం.. వైరల్ వీడియో
కాలికి గాయం... అయినా మందు కోసం పరుగులు!
ఆస్పత్రికి వెళ్లాల్సినోడు.. వైన్స్ ముందు అడ్మిట్!
“మందే ముఖ్యం” అన్నట్టుగా వైన్స్ ముందు పడకేసిన వ్యక్తి....
కాలికి గాయం అయింది..
డాక్టర్లు చికిత్స చేశారు..
రెస్ట్ తీసుకోవాలని చెప్పారు..
కానీ మనోడికి మాత్రం అవేమీ పట్టలేదు!
ఆస్పత్రికి వెళ్లాల్సిన వ్యక్తి.. ఏకంగా వైన్స్ షాపు ముందు ప్రత్యక్షమయ్యాడు!
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి వైన్స్ వద్ద ఓ వ్యక్తి కాలికి చికిత్స జరిగిన పరిస్థితిలోనే మద్యం కోసం వచ్చినట్లు కనిపించాడు.
నడవడానికే ఇబ్బంది పడుతున్నాడు..
కాలికి గాయం ఉంది..
కానీ మద్యం కోసం మాత్రం వైన్స్ వరకు వచ్చాడు!
అంతేకాదు.. చివరికి వైన్స్ దుకాణం ముందే పడకేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.
“ఆస్పత్రిలో బెడ్ ఎందుకు.. వైన్స్ ముందు నేల ఉంటే చాలు” అన్నట్టుగా అక్కడే పడుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఈ దృశ్యాన్ని అక్కడున్న యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
కాలికి చికిత్స జరిగినా..
మందుపై ప్రేమ మాత్రం తగ్గలేదంటూ పలువురు సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరు మాత్రం..
“ఇది సరదా విషయం కాదు.. మద్యం వ్యసనం మనిషిని ఎంతటి పరిస్థితికి తీసుకెళ్తుందో ఆలోచించాల్సిన ఘటన” అంటూ స్పందిస్తున్నారు.
ఒకవైపు ఆరోగ్యం కోసం ఆస్పత్రులు..
మరోవైపు మత్తు కోసం వైన్స్‌లు..
చివరికి ఆస్పత్రి బెడ్‌కి బదులు.. వైన్స్ ముందు బెడ్!
మొత్తానికి నర్సాపూర్‌లో కనిపించిన ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ..
“మందు మీద ఇంత ప్రేమా.. లేక ఇది వ్యసనానికి పరాకాష్టా?”
అనే చర్చకు దారితీస్తోంది.




