Narsapur: పండించిన వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి ధర్నా చేసిన రైతులు

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు.

ASHOK REDDY, NARASAPOOR
Published on: 15 May 2026 12:08 PM IST
Narsapur
X

Narsapur: పండించిన వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి ధర్నా చేసిన రైతులు

నర్సాపూర్: కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు జరగడంలేదని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో రైతులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు గత వారం పది రోజులుగా కల్లాల నుండి ధాన్యం సేకరణ జరగడంలేదని రోజుల తరబడి కల్లాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తీరుకు నిరసనగా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో రైతులు వడ్లను పారబోసి మానవహారం నిర్మించి నిరసన వ్యక్తం చేశారు నిరసన సందర్భంగా పోలీసులతో రైతులు వాగ్వాదం కొనసాగించారు. నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ రెడ్డి రైతులకు సర్ది చెప్పిన వినని పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు నిర్వహించాలని లేకుంటే ఆందోళనలను ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

ASHOK REDDY, NARASAPOOR

ASHOK REDDY, NARASAPOOR

Next Story