Medak: నర్సాపూర్ పట్టణ బీజేపీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్ యాదవ్ నియామకం!
Medak: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ బీజేపీ కన్వీనర్‌గా గొల్ల ప్రేమ్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు.
Medak: నర్సాపూర్ పట్టణ బీజేపీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్ యాదవ్ నియామకం!
medak: నర్సాపూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కన్వీనర్‌గా గొల్ల ప్రేమ్ కుమార్ యాదవ్ నియమిస్తు బీజేపీ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్డాదాస్ మల్లేష్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు. పార్టీపై నమ్మకంతో, క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ప్రేమ్ కుమార్ యాదవ్ సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన ప్రేమ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పట్టణ బీజేపీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ నర్సాపూర్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
పట్టణంలోని ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని తెలిపారు. అలాగే పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రేమ్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఇ కార్యక్రమం లో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘ సాని సురేష్,గుండం శంకర్, రాములు నాయక్, ఆంజినేయులు గౌడ్ తదితరులు ఫాల్గొన్నారు. నర్సాపూర్ పట్టణ బీజేపీ కన్వీనర్‌గా గొల్ల ప్రేమ్ కుమార్ యాదవ్ నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.




